షాపూర్ నగర్ లో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో ఈరోజు *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి షాపూర్ నగర్ చౌరస్తా వరకు కాలినడకన బయలుదేరి.. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు…
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సుపరిపాలన,అభివృద్ధి, రజనీతిగ్నమైన ఆలోచనలు ఎప్పటికి మర్చిపోలేనివాన్నారు..
వై ఎస్ ఆర్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళ సంఘాల అభివృద్ధికి పావలా వడ్డీకే రుణాలు అందించారాని గుర్తు్చేశారు..
ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్య శ్రీ, 108,104 అలాగే విద్యార్థుల భవిషత్తు దృష్ట్యా ఫిజు రియంబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి చాలా కృషి చేశారని కొనియాడారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ సంఘాల నాయకురాలు, యువజన సంఘాల నాయకులు,NSUI నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
