ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం – నసీంపేటలో భూమి పూజ

TEJA NEWS

ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం – నసీంపేటలో భూమి పూజ

సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈరోజు నసీంపేట గ్రామంలో భూమి పూజ నిర్వహించారు.
గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న సామాన్య ప్రజల సొంత ఇంటి కల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నెరవేరిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భూమిపూజ అనంతరం ముగ్గుపూజ చేసి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హౌసింగ్ పిడి, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మూల యల్లయ్య, కాంగ్రెస్ నాయకులు సైదులు, రమేష్, వెంకన్న తదితరులు హాజరయ్యారు. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top