అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు పట్టివేత..

TEJA NEWS

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పోలీసులు నిరంతరంగా చర్యలు తీసుకుంటున్నా, అక్రమ రవాణా ఆగడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను అశ్వారావుపేట పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాలపై పలుమార్లు హెచ్చరించిన వారు మారడం లేదని తెలిపారు. ఇలాగే అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణా దారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top