సచివాలయ మహిళా ఉద్యోగి చేయి పట్టుకొని లాగిన జాజుల పెద్ద తిరపతయ్య

TEJA NEWS

సచివాలయ మహిళా ఉద్యోగి చేయి పట్టుకొని లాగిన జాజుల పెద్ద తిరపతయ్య

నిందితుడిపై కేసు నమోదు

ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామంలో సచివాలయ ఉద్యోగినిపై వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పశువులకు సంబంధించిన విధులను నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగినిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేయి పట్టుకుని లాగి, భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిని జాజుల పెద్ద తిరుపతయ్య అనే వ్యక్తి తన దూడ ఆరోగ్యం బాగోలేదంటూ ఇంటికి పిలిపించాడు. ఆమె వారి ఇంటికి వెళ్లి పశువులను చూస్తున్న క్రమంలో, తిరుపతయ్య ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని లాగాడు. దీంతో భయపడిన ఆ మహిళా ఉద్యోగిని కేకలు వేయడంతో, చుట్టుపక్కల ప్రజలు వెంటనే అక్కడకు చేరుకున్నారు.స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించారు. నిందితుడు జాజుల పెద్ద తిరుపతయ్యను అదుపులోకి తీసుకుని, అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడికి వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top