గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీవో జారీ….

TEJA NEWS

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీవో జారీ

గ్రామ(Village), వార్డు సచివాలయాల్లో(ward Secretariats) పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉద్యోగులకు పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జీవో సైతం జారీ చేసింది.

ఇక ఈ కమిటీలో పది మంది మంత్రులు పని చేయనున్నారు. జీవోఎంలో సభ్యుడిగా పవన్ కల్యాణ్‌కూ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై ఈ కమిటీ శరవేగంగా అధ్యయనం చేయనుంది. త్వరలోనే కార్యచరణను మొదలు‌పెట్టనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపైనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top