అయ్యప్పస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ వైభవంగా నిర్వహణ

TEJA NEWS

అయ్యప్పస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ వైభవంగా నిర్వహణ

చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఉన్న చిన్న పసుమర్రు ఓగేరుకు దక్షిణాన వెలసిన అయ్యప్పస్వామి దేవస్థానంలో మాల ధరించిన స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెలంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ, దసరా పండుగ నుండి సంక్రాంతి పండుగ వరకు దేవాలయంలో ప్రతిరోజు అయ్యప్ప స్వాములకు, మాల ధరించిన ఇతర స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దాతలు, భక్తులు, కమిటీ సభ్యుల సహకారంతో నిరాటంకంగా కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు.ప్రతిరోజు సుమారు 500 నుంచి 600 మంది స్వాములు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని రవిశంకర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు, పసుమర్తి రామమూర్తి, నాగబైరు జగన్మోహన్రావు, కమ్మిలి శివరామకృష్ణ, భవిరిశెట్టి మణి, ఊటుకూరు శ్రీనివాసరావు, గుగ్గిలం రమేష్ తదితర ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top