“క్షార సూత్ర” ఆయుర్వేద ప్రోడక్ట్ ఆవిష్కరణ

TEJA NEWS

క్షార సూత్ర” ఆయుర్వేద ప్రోడక్ట్ ఆవిష్కరణ
తిరుపతి: నగరంలోని హోటల్ రాజ్ పార్క్ లో “క్షారసూత్ర” అనే ఆయుర్వేద ప్రోడక్ట్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఐఎంఏ మాజీ అధ్యక్షులు డా.ఎస్. బలరామరాజుతో పాటు టీటీడీ ఆయుర్వేద కాలేజీ వైద్యాధికారి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డా.ఎంఏ హరిబాబు, డా.కీర్తిన్మయి, డా.వి.మధుసూదన్, డా.శ్రీనివాస్ రావులు అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ధన్వంతరి ప్రార్థనతో మొదలైన అనంతరం క్షారసూత్రను ఉద్దేశించి డా. మార్తా భాస్కరరావు మాట్లాడుతూ క్షారసూత్ర చికిత్సలోని వైద్య ప్రాధాన్యం, దాని వారసత్వాన్ని, ఉపయోగాలు, ప్రతి ఫలాలు గురించి వక్తలు వివరించారు. ఆయుర్వేద చికిత్స పద్ధతిలో క్షార సూత్ర విధానం మాత్రమే 99శాతం ఫలితాలను ఇస్తున్నదని, ఇది సాంప్రదాయ… ఆధునిక చికిత్స పద్ధతుల మేలవింపు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.ఆశా వర్మ, డా.హారతి శర్మ, డా.సాయి ప్రకాష్, గుండాల గోపినాధ్ రెడ్డి, తమ్మినేని, సుమన ఆనోరెక్టల్ హాస్పిటల్ నిర్వాహకురాలు ఎం.సునంద తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top