భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి మంత్రం “వందేమాతరం” గీతం

TEJA NEWS

భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి మంత్రం “వందేమాతరం” గీతం వెలువడి 150 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతం ఆలాపన చేసిన -MLA బొండా ఉమ గారు

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో స్థానిక నాయకుల భాగస్వామ్యం చాలా ముఖ్యం -MLA బొండా ఉమ

విద్య, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పన ఈ మూడు స్తంభాలపై ఆధారపడి యువత భవిష్యత్తును నిర్మించడానికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉంది

ధి:-7-11-2025 శుక్రవారం ఉదయం 10:00 గంటలకు సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్, మాచవరం ప్రాంతంలో ఉన్న SRR & CVR గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో విజయవాడ నగర పలు మూలలో నుండి విచ్చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు,స్కిల్ డెవలప్‌మెంట్ కు పెద్ద ఎత్తున యువత పాల్గొని వారి వారి చదువుకు తగ్గ ఉద్యోగాలకు నమోదు చేసుకోవడం జరిగింది…

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన :- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ముందుగా  “వందేమాతరం” గీతం వెలువడి 150 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో విద్యార్థులతో కలిసి ఆలపించి, జ్యోతి ప్రజ్ఞాలన గావించి 4000 వేల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఇటువంటి జాబ్ మేళాలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు…

ఈ సందర్భంగా బోండా ఉమా గారు మాట్లాడుతూ :-స్వాతంత్ర్య పోరాటం దిశగా నాడు భారత జాతిని జాగృతం చేసిన ఈ గీతం, నేడు వికసిత భారత నిర్మాణం దిశగా యువతను చోదకశక్తులుగా తయారు చేసే విధంగా స్ఫూర్తినింపగలదని, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతీ యువకుల కోసం, వారి జీవితాల్లో స్థిరపడటానికి అన్ని రకాల కార్యక్రమాలు NDA ప్రభుత్వం నిత్యం చేపడుతుంది అని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల కాలంలో రాష్ట్రంలో యువతీ యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాం అని…

ఇవాళ రాష్ట్రంలో యువతీ యువకుల కోసం 10,00,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఎంఓయుల ద్వారా ఆకర్షించబడ్డాయి అని, ప్రపంచం మొత్తం మీద ఎక్కడైతే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందో, ఆ దేశాలన్నింటినీ స్వయంగా ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్, అలాగే నారాయణ గారు, మరియు మంత్రులందరూ కూడా జల్లెడ పట్టి తిరుగుతున్నారు అని, వారు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయి వంటి అనేక దేశాలతో సమావేశాలు నిర్వహించి, ఆయా దేశాలలోని పెట్టుబడిదారులను ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు అని…

ఎల్లుండి జరగబోయే విశాఖపట్నం సీఐఐ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు మరియు అగ్రిమెంట్లు కుదుర్చుకోబోతున్నారు అని, ఇప్పటికే, గూగుల్ డేటా సెంటర్ 1, 30,00,000 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో రాబోతోంది అని, దీని వల్ల, మరియు దీని అనుబంధ కంపెనీల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి, ఇది రాష్ట్ర యువతకు ఒక గొప్ప అవకాశం అని…

జనవరిలో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి క్వాంటం వ్యాలీ అమరావతిలో మొదలు కాబోతోంది, ఇది కూడా ఒక గేమ్ ఛేంజర్, దీని వల్ల కూడా పిల్లలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, క్వాంటం టెక్నాలజీ అనేది భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోయే రంగం, కాబట్టి ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మన యువతకు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే నైపుణ్యాలు లభిస్తాయి అని…

ఈరోజు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం లో ప్రతి 3, 4 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం అని, ఈ జాబ్ మేళాల ద్వారా వేలాది మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి అని, అంతేకాకుండా ప్రతి వారం కూడా కలెక్టరేట్లలో దీని కోసం ఒక అధికారిని నియమించి, ఆ అధికారి ద్వారా అప్లికేషన్లు తీసుకుని, జాబ్ రెజ్యూమ్‌లన్నీ కూడా సేకరించి, వారికి సూటబుల్ జాబ్స్ వెతికి, ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం అని, ఈ ప్రక్రియ ద్వారా నిరుద్యోగ యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి అని…

ఈ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తు కేవలం ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి, వారిని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి కూడా కృషి చేస్తు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను నేర్పిస్తున్నాము అని…

ఈ కార్యక్రమాలన్నీ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారిని స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తు, యువత శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతు, విద్య, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పన ఈ మూడు స్తంభాలపై ఆధారపడి యువత భవిష్యత్తును నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని…

రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను రూపొందించడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, MP లు కృషి చేస్తున్నారు అని…

ఇది కేవలం పెద్ద కంపెనీలనే కాకుండా, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అని, యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, స్వయం ఉపాధి అవకాశాలను కూడా ప్రోత్సహిస్తు, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతోంది అని ఈరోజు జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయిన వారికి తక్షణమే కాల్ లెటర్స్ ను అందజేస్తామని తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో:- SRR కళాశాల ప్రధానోపాధ్యాయురాలు K భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా DEO మధు భూషణ్, ఎన్టీఆర్ జిల్లా DSDO S శ్రీనివాసరావు, విజయ్ దీప్, డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, వల్లభనేని సతీష్, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సతీష్, తదితర ముఖ్య అధికారులు నాయకులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top