జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది..

TEJA NEWS

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది..

కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ 20 వేలకు పైగా ఓట్ల లీడ్‌లో కొనసాగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగడ్బందీగా అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధినీ కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు తెలంగాణ ప్రజానీకానికి చేసిన ద్రోహానికి జూబ్లీహిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.

జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top