జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక భారీ మెజారిటీతో (24,711 ఓట్ల మెజారిటీతో) విజయం సాధించిన సందర్బంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ‘జై కాంగ్రెస్ పార్టీ’ ‘జైజై రేవంతన్న’ నినాదాలతో సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్యంలో రాష్ట్ర అభివృద్ధి గణనియంగా పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కాశినాథ్ యాదవ్, షౌకత్ అలీ మున్నా, సంగమేష్, రాషీద్, నవాజ్, దుర్గేష్, మహేష్, సంతోష్ బిరాధర్, గిరి, సతీష్, సుధాకర్, శ్రీను, వెంకట్, హనుమంతు, మొహమ్మద్, రాజు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
