సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్

TEJA NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top