మన ఇంట్లో మనం చెట్టు నాటుకొని – పర్యావరణాన్ని కాపాడుకుందాం
….
పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచడం ఒకటే పరిష్కారమని మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డి పాళెం మున్సిపాలిటీలోని పెద్దూరులో గర్ల్స్ హై స్కూల్ నందు నిర్వహించినటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు పరిశుభ్రతతో భాగస్వామ్యం కావాలని చైర్ పర్సన్ గా తెలియజేశారు. ప్రతిరోజు శుభ్రంగా ఉండాలని ,స్నానం చేయడం శుభ్రమైన బట్టలు ధరించడం ఎంతో అవసరమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు.ఈ సందర్భంగా పచ్చదనం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో చెట్లు నాటారు. అనంతరం పచ్చదనం పెంచడంతో పాటు బుచ్చిరెడ్డి పాళెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మాట్లాడుతూ ఇంటికో చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. కలుషితమైన వాతావరణంలో నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించాలంటే చెట్లు నాటి పచ్చదనం పెంచడమే ఏకైక పరిష్కారం అన్నారు. ఇళ్లలోని చెత్తా చెదారాలు ఇతర వ్యర్ధ పదార్థాలను వీధుల్లో కాలువల్లో వేసి అపరిశుభ్రంగా మార్చవద్దని ఆమె స్కూల్ విద్యార్థులకు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ, వైస్ చైర్మన్ ఎరుటపల్లి శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు కత్తి శ్రీదేవి , తాళ్ల వైష్ణవి , గర్ల్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ సుజాత, అర్బన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ మనోజ్,ఏఇ, వెంకటేష్, పూజిత, మెప్మా సీఓ నర్మద, ఏఎన్ఎం పద్మ, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు….
