బిఆర్ఎస్ కన్వీనర్ గా జుజ్జురి వెంకన్న బాబు నియమకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం బిఆర్ఎస్ కన్వీనర్ గా జుజ్జురి వెంకన్న బాబు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ నియమకాన్ని ప్రకటించారు. పార్టీ నిర్మాణంలో లోపాలు సరిదిద్ది, అన్ని మండలాలు, పట్టణాలకు బాధ్యతలను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పార్టీని బలోపేతం చేసి, స్థానిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
