సాంప్రదాయ బద్ధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
. ….
సాక్షిత : భక్తి పారవశంతో 108 జంటలు పాల్గొన్నారు
600 మందికి పైగా మహా ప్రసాద వితరణ
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు సామూహిక “శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం” ఓం నమశ్శివాయ శర్మ, సత్యం స్వామి, సమక్షంలో “కొల్లారెడ్డి సునీల్ రెడ్డి దంపతులు”, మరియు సత్యనారాయణ స్వామి బృందం ఆధ్వర్యంలో 108 జంటలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సాంప్రదాయబద్ధంగా, పరిమళ పుష్పాలతో, మంగళ వాయిద్యాలతో, వేద పండితుల మంత్రోచ్ఛారణతో, కార్తీక బహుళ ఏకాదశి నాడు అత్యంత శ్రేష్టంగా జరిగింది. 600 మందికి పైగా మహ అన్న ప్రసాదాలు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముందుగా ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆలోచన “కీ.శే.” తిరుమూరు విజయ్ కుమార్ రెడ్డి రావడం జరిగింది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం “గత 15 సంవత్సరాల” నుంచి ఈ కార్యక్రమాల దిగ్విజయంగా స్వామివారి జరిపించుకుంటున్నారు. చుట్టుపక్కల వారే కాకుండా బయట వారు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని పుణ్యహితులవుతున్నారు. అన్ని పల్లెటూర్ల కంటే మా ఇనమడుగు గ్రామం ఒక ప్రత్యేకత ఉంది నిత్యం ఏదో ఒక దేవస్థానంలో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుగుతుంటాయి. ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరంగా అందుకు మేము గొప్పగా చెప్పుకుంటాం. మా ఇనమడుగు గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ద్వారా ఎండోమెంట్ కి సంప్రదించి ఇనుమడుగు గ్రామ పెద్దలతో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో కొల్లారెడ్డి సునీల్ రెడ్డి దంపతులు, గుత్తికొండ వెంకయ్య దంపతులు, శ్రీ సత్యనారాయణ స్వామి భక్త బృందం, పోలిశెట్టి నాగేశ్వరరావు, చింతలపూడి పెంచలయ్య, పురుషోత్తం, తదితరులు…
