ఇష్టా మీడియా 360 హెల్త్ హానర్ – 2025
తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ & మెగా ఈవెంట్ – 2025
సమాజానికి అంకితభావంతో, సేవాభావంతో వైద్య సేవలు అందిస్తే గుర్తింపు స్వయంగా వచ్చి చేరుతుందని మరోసారి నిరూపించింది రాందేవ్రావు హాస్పిటల్. ఇష్టా మీడియా వారు నిర్వహించిన తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025 లో ఈ ఆసుపత్రి గౌరవప్రదంగా ఉత్తమ ఆసుపత్రి అవార్డు (Best Hospital Award) అందుకోవడం విశేషం.
అదే వేడుకలో ఆసుపత్రిలో సేవలందిస్తున్న ఏడు మంది వైద్యులకు బెస్ట్ డాక్టర్ అవార్డులు ప్రదానం కావడం రాందేవ్రావు హాస్పిటల్కి మరొక గర్వకారణం.
ఈ ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ MAYA లగ్జరీ కన్వెన్షన్ హాల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 5 గంటల వరకు అత్యంత శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా JD లక్ష్మీనారాయణ గారు (Retd. IPS Officer), ఏటలా రాజేందర్ గారు, సినీ నటుడు ప్రియదర్శన్ గారు హాజరై అవార్డులు అందజేశారు.
అవార్డు అందుకున్న వైద్యులు
• RH మెడికల్ డైరెక్టర్ డా. కె. కమలాకర్
• గైనెకాలజీ HOD డా. చాయాదేవి
• సీనియర్ గైనెకాలజిస్ట్ డా. ఎల్. ప్రమోదిని
• CEO డా. ఎన్. యోబు
• జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డా. ఎన్. రాజీవ్ వర్మ
• మెడికల్ ఆఫీసర్ డా. ఏ. సత్యనారాయణ
• మెడికల్ ఆఫీసర్ డా. పి. సున్నిత్
ఇవార్డులు అందుకోవడం పట్ల అందరు వైద్యులు తమ ఆనందాన్ని మరియు కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.
కూకట్పల్లి ప్రాంతంలో “Lungs of Kukatpally”గా పేరుగాంచిన రాందేవ్రావు హాస్పిటల్, ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ విశ్వాసాన్ని గెలుచుకుంది. ఈ విశ్వాసమే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు హేతువు.
ఈ సందర్భంగా CEO డా. ఎన్. యోబు మాట్లాడుతూ, ఇష్టా మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ, అవార్డు అందుకున్న ప్రతి వైద్యునికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామని పేర్కొన్నారు.
