ఘనంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు

TEJA NEWS

ఘనంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గంలో
తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ , మార్కెటింగ్ , కోఆపరేషన్ మరియు టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ముందుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నాచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలులో రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పంట కొనుగోలు చేస్తామని తెలియజేయడమైనది. అనంతరం రైతులతో కలిసి తుమ్మల పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభకాంశాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top