18 మంది స్కూల్ పిల్లలను తరలిస్తున్న ఆటోపై కేసు నమోదు …….. రూరల్ ఎస్సైజెలెందర్ రెడ్డి
- రూరల్ ఎస్సై, ట్రాఫిక్ ఎస్సై సంయుక్త తనిఖీలు
- వాహనాన్ని ఆర్టీవోకి అప్పగించి చట్టపరమైన చర్య
వనపర్తి : జిల్లా కేంద్రంలో వనపర్తి రూరల్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఓ ఆటోలో సామర్థ్యానికి మించి 18 మంది రాక్ వుడ్ స్కూల్ పిల్లలను ప్రమాదకరంగా తీసుకెళ్తున్న ఆటోను రూరల్ ఎస్సై మరియు ట్రాఫిక్ ఎస్సై లు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, వాహనంపై కేసు నమోదుచేసి ఆర్టీవో విభాగానికి అప్పగించారు.
పోలీసులు ప్రజలకు
పాఠశాల విద్యార్థులను తరలించే ప్రతి డ్రైవర్, వాహన యజమాని తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలనీ ఆటోలు లేదా ఇతర వాహనాల్లో సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించడం చట్టవిరుద్ధమే కాకుండా వారి ప్రాణాలకు ముప్పు కలిగించే ప్రమాదకర చర్య. పిల్లల భవిష్యత్తు వారి తల్లిదండ్రులకే కాదు… సమాజానికీ అవసరం అందుకే తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకులు తమ పిల్లలు ఎక్కడి వాహనాల్లో వెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు అన్న విషయంపై అప్రమత్తంగా ఉండాలనీ. రవాణా నిబంధనలు ఉల్లంఘించే ఎవరిపై నైనా కఠిన చర్యలు తప్పవని
విద్యార్థుల భద్రతను ప్రమాదంలో పడేసే ఇటువంటి నిర్లక్ష్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని
వనపర్తి పోలీసులు స్పష్టం చేశారు.
