ఘనంగా జేఎన్టీయూహెచ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు

TEJA NEWS

ఘనంగా జేఎన్టీయూహెచ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు

*ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి, బండి రమేష్

కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు సమాజానికి తమ వంతుగా తిరిగి సహాయం చేయాలని సూచించారు. జేఎన్టీయూ అధికారులతో పాటు పూర్వ విద్యార్థులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, కూకట్పల్లి పుష్పారెడ్డి , ఫణి కుమార్, కొప్పిశెట్టి దినేష్, గంధం రాజు, శివా చౌదరి , మధు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top