ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచిన చౌదరిగారి బుచ్చిరెడ్డి
*40 మంది విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు
*వారధిగా నిలిచిన హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ అధ్యక్షుడు విజయకుమార్
కుత్బుల్లాపూర్ :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ సూరారం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులు పరీక్ష పీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ అధ్యక్షుడు విజయకుమార్ సమస్యను కాంగ్రెస్ నాయకుడు చౌదరిగారి బుచ్చిరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. విషయం విన్న వెంటనే స్పందించిన బుచ్చిరెడ్డి భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా…పాఠశాల విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు చౌదరిగారి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…ప్రభుత్వం పాఠశాలలను కాపాడుకావాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. విద్యార్థులు కూడా చక్కగా చదువుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు.
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ అధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ…తాము చేసే సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు అండగా నిలిచిన విజయకుమార్, బుచ్చిరెడ్డిలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిమ, ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ చికిలే మధుబాబు, అంజి, శ్రీధర్, భరత్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
