రాష్ట్రం ఆలయాల అభివృద్ధికి వేగంగా అడుగులు
ఒక్కోదగ్గర ఒక్కో విధంగా ఆలయాలను అభివృద్ధి
బాసర నుంచి కీసర దాకా అన్ని డెవలప్ చేస్తున్నం దేవాదాయ శాఖ
ప్రజా ప్రభుత్వంలో దేవాలయాల ఆదాయం ఘనంగా పెరిగింది
భక్తులకు ఇబ్బందుల్లేకుండా చేయడమే మా బాధ్యతః కొండా సురేఖ
హైదరాబాద్ః
ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల ఆదాయం గతం కంటే ఘననీయంగా పెరిగింది. గత ప్రభుత్వంలో పదేండ్లు ముఖ్యమంత్రి చేసిన ఒక నాయకుడు కేవలం ఒక దేవాలయం మినహా మిగతావి అన్నీ నిర్లక్ష్యానికి గురి చేయగా… ప్రజా ప్రభుత్వంలో మాత్రం అన్ని దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి టెంపుల్ ను అభివృద్ధి చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది. అందుకే, ఆదాయం పెద్ద ఎత్తున పెరిగింది. 2023 సంవత్సరం చివరి అంకంలో రాష్ట్రంలోని ఉన్న 699 దేవాలయ సంస్థలను నుంచి రూ. 373.55 కోట్లు ఆదాయం వస్తే… ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల ద్వారా రూ. 2024లో 544.61 కోట్లు వచ్చినట్టు దేవాదాయ శాఖ గణాంకాలే చెబుతున్నాయి.
కార్తీక మాసంలో… యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి ప్రజా ప్రభుత్వంలో భారీ ఆదాయం వచ్చింది. ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకున్న మొత్తంగా 20 లక్షల 52 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రజా ప్రభుత్వం భక్తులకు వసతులు కల్పించడం పెరగడంతో… భక్తుల సంఖ్య పెరిగిందని ఎండోమెంటు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. టెంపుల్ కు ఆదాయం 17 కోట్ల 62 లక్షల 33 వేల 331 రూపాయలు వచ్చాయి. అయితే, గతేడాది ఆదాయ 14 కోట్ల 30 లక్షల 69 వేల 481 రూపాయలు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా పరిశీలిస్తే… గతేడాది కంటే 3 కోట్ల 31 లక్షల 63 వేల 850 ఆదాయం స్వామివారి దేవాలయానికి అధికంగా వచ్చింది. అయితే, ఈ ఆదాయం కూడా టెంపుల్ అభివృద్ధికే ఉపయోగించునున్నామని దేవాదాయ శాఖ స్పష్టం చేస్తున్నది.
ప్రధాన దేవాలయాల అభివృద్ధిలో పరుగులు
వీటితో పాటు రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధిపై ఎండోమెంటు శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలోని దేవాదాయ శాఖ పెట్టింది. అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించి వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో సుమారు రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రెడీఅయింది. ముఖ్యంగా చెరువుగట్టు, కొండగట్టు, భద్రాచలం, వేములవాడ ఆలయాలకు భారీగా నిధులు కేటాయించింది. యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారు తాపడం పనులు జరుగుతున్నాయి. ఇందులో దేవస్థానం వద్ద నిల్వ ఉన్న 25 కిలోల బంగారంతోపాటు విరాళంగా వచ్చిన 35 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. గోల్డ్ ప్లేటింగ్ తయారీ, ఫిక్సింగ్ చార్జీలకు కలిపి మొత్తం రూ. 8 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఇంకా 17 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేదపాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. దీంతోపాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడానికి 101 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల వసతి కోసం కొండపై డార్మెటరీ హాల్ ఏర్పాటు చేశారు. వైటీడీఏకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించడంతోపాటు పరిపాలనలో పారదర్శకతకు పట్టం కట్టారు. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.76 కోట్లు మంజూరు చేసింది. దీనిలో అన్నదానం సెంటర్ నిర్మాణానికి రూ.35.25 కోట్లు కేటాయించింది. శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి, గుడి చెరువు సుందరీకరణకు మరో రూ.20 కోట్లు మంజూరు చేసింది.
శరవేగంగా అన్ని ఆలయాల అభివృద్ధి
భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భూ సేకరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. వరంగల్ లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు, నిర్మాణానికి రూ.30 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధులు, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) నిధుల నుండి కేటాయించింది. మాడవీధుల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, దేవాలయ అభివృద్ధికి రూ.12.15 కోట్లు మంజూరు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ కురుమూరి జాతరకు సంబంధించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే రూ.110 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా స్థానాల లక్ష్పురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కల్యాణ వేదిక, అభిషేక మండపం, వసతి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. కామారెడ్డి జిల్లాలోని సలాబత్‌పూర్ శ్రీ మారుతీ మందిర్‌కు సంబంధించి రూ.6.70 కోట్లతో కల్యాణమండపం, ప్రకారమండపం, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
భక్తులకు ఇబ్బందుల్లేకుండా చేయడమే మా బాధ్యతః కొండా సురేఖ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి.
గత ప్రభుత్వం కేవలం ఒక టెంపుల్ మాత్రమే డెవలప్ చేసిన పరిస్థితి ఉన్నది. అయితే, మా ప్రభుత్వం మాత్రం వేములవాడ, భద్రాద్రి, కొండగట్టు, ధర్మపురి మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని చాలా దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నం. బాసర, కీసర… భద్రాద్రి, భద్రకాళి… ఐనవోలు, కొమురవెళ్ళి ఇలా ఎన్నో టెంపుల్ లను డెవలప్ చేస్తున్నం. వాటి విస్తరణ పనులు నడుస్తున్నాయి. వీలైనంత వేగంగా పనులు చేపడుతున్నం. టెంపుల్ పనులు పూర్తి చేసేదాకా మేం నిద్రపోం. అయితే, భక్తులకు ఇబ్బందుల్లేకుండా చేసేందుకే తాము ఈ చర్యలు చేపడుతున్నాం.
