చిత్తూరు రూరల్ లో రైతన్నా… మీకోసం

TEJA NEWS

చిత్తూరు రూరల్ లో రైతన్నా… మీకోసం

చిత్తూరు: చిత్తూరు రూరల్ మండలం పాలూరు గ్రామపంచాయతీ పాలూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రచారంలో భాగంగా “రైతన్న… మీకోసం” చేపట్టారు. టీడీపీ జిల్లా కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి… రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల గురించి అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్.. ప్రభుత్వం నుంచి రైతులకు మద్దతు ధర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే పాడి పరిశ్రమలకు అండగా పశుగ్రాసాల పెంపకం, పశువుల దాణా పంపిణీ గురించి, గుడ్ల ఉత్పత్తి… పౌల్ట్రీ ఫార్మ్స్ గురించి, కోళ్ల పెంపకంతో పాటు బ్రాయిలర్ కోళ్ల గురించి వివరించారు. పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు, సంపద సృష్టి గురించి, సంక్షోభం నుంచి సంక్షేమ దిశగా సూపర్ సిక్స్ హామీ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు.

17 నెలల కాలంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పారు. వాటిలో “తల్లికి వందనం”.. “శ్రీ శక్తి ఉచిత బస్సు”…. “దీపం-2″… ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ…. 20 లక్షల ఉద్యోగాల గురించి… మెగా డీఎస్సీ… అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల మన్ననలు పొందారనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, హనుమంతు నాయుడు, గోవిందరాజులు, శ్రీనివాసులు, పట్టాభి, పుష్ప, జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ సిబ్బంది, వెటర్నరీ, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి, గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top