రైతన్న..మీకోసం” లో టీడీపీ పరిశీలకులు

TEJA NEWS

“రైతన్న..మీకోసం” లో టీడీపీ పరిశీలకులు

** ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా హాజరు
……

శ్రీకాళహస్తి / తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా నియమితులైన “తుడ” చైర్మన్ కమ్ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి నిర్వహించిన “రైతన్న..మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలసి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం గాజులమండ్యం పంచాయతీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అన్నదాత సుఖీభవ పథక లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి, స్థానిక రైతులకు ప్రభుత్వంచే అందిస్తున్న సబ్సిడీ పశువుల దాణా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top