ఉద్యోగుల సిఫార్సులపై దర్శనాలు కల్పించాలి
** ఇళ్ల స్థలాలు వెంటనే ఇప్పించాలి
** టీటీడీ ఈఓతో జేసీఏ నేతల చర్చలు
తిరుపతి: ప్రతి సంవత్సరం వస్తున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనూ…
బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతినెలా టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలపై స్వామివారి దర్శనభాగ్యం కల్పించాలని టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ఈఓకు విన్నవించారు. దీనిపై త్వరగా స్టాండర్డ్
ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈమేరకు టీటీడీ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ అసోసియేషన్ (జేసీఏ)
అధ్యక్షులు గోపాలకృష్ణా రెడ్డి, కన్వీనర్ గంపల వెంకట రమణా రెడ్డి, ఉపాధ్యక్షురాలు సామిరెడ్డి కల్పన, ఇతర సభ్యులు బుధవారం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఫండ్ మళ్లీ పునరుద్దించాలని కోరారు.
చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న టీటీడీ ఉద్యోగులకు పిసిఎ రూ5,000… హిల్ అలవెన్సు రూ.1,000 కు పెంచాలన్నారు. ఉద్యోగుల జనరల్ బాడి ఎలక్షన్స్ జరిపించాలి. తిరుపతి పరిపాలనా భవనంలో జనరల్ ఎంప్లాయిస్ సమస్యలపై చర్చించుకొని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక రూంను కేటాయించ వలసిదిగా కోరారు.
అలాగే పరిపాలనా భవనంలో ముందు వైపు, వెనుక వైపు వీల్ చైర్ ను ఏర్పాటు చేయాలి. నైట్ డ్యూటీ చేస్తున్న ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలెవెన్స్ ఇప్పించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రత్యేకంగా 5 రోజుల సెలవు మంజూరు చేసారని, అదే విధంగా టీటీడీలో కొన్ని విభాగాలు అమలు చేయడం లేదని ఈఓకు తెలిపారు. పాదిరేడు వద్ద టీటీడీ వారు ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కేటాయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇంతవరకు డెవలప్మెంట్ చేసి ఉద్యోగులకు స్వాధీనం చేయలేదని పేర్కొన్నారు.
వెంకటగిరి వద్ద పల్లాం సమీపంలో ఉన్న ల్యాండ్ కు టీటీడీ వారు అమౌంట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. కాని ఇంత వరకు సదరు ల్యాండ్ ను టీటీడీ వారు స్వాధీనం చేసుకోలేదు. పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. టీటీడీలో 1060 అమెండ్మెంట్ చేయడానికి కమిటీ వేయడం జరిగింది. కానీ ఇంత వరకు 1060 అమెండ్మెంట్ జరగలేదు. టీటీడీ రెఫరల్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న ఉద్యోగులకు వైద్య ఖర్చులు నిమిత్తం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచవలసినదిగా కోరడమైనది.
ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, యఫ్ఎ అండ్ సీఏఓ బాలాజీ, వెల్ఫేర్ డిప్యూటీ ఈఓ ఆనంద రాజు, డీఈవో వెంకట సునీల్, సియంఓ డాక్టర్ కుసుమ పాల్గొన్నారు. వారందరికీ ఉద్యోగస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జేసీఏ నేతలు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఎల్ఎన్.వీ రవికుమార్, హేమసుధ,
సెక్రటరీ ఆఫ్ జనరల్ ముని వెంకట రెడ్డి, పలువురు
సంఘ నాయకులు, సంఘ సభ్యులు కూడా పాల్గొన్నారు.
