కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

TEJA NEWS

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు ||

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ -బి బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ఆకర్షితులై మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు..ఆదేవింధంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, తెలిపారు.

ప్రతి తెల్ల కార్డుదారునికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ కార్డుల పంపిణీ, ఏ ప్రభుత్వం చేయని పనిని ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. కాలనీ సంక్షేమ అభివృద్ధి లో తాను ఎల్లప్పుడు ముందు ఉంటానని తెలియచేసారు. పార్టీ లో చేరిన వారు నవీన్ గౌడ్, కృష్ణ గౌడ్, ప్రభు గౌడ్, ప్రశాంత్ కుమార్, మహమ్మద్ జైబుయిన్ , విష్ణు వర్ధన్, ఎల్లయ్య, రాములు, వెంకటయ్య, మధుసూదన్ గౌడ్, ప్రభావతి , వెంకటమ్మ , హాలీ బేగం, నాగరాణి, అరుణ , లావణ్య, రాణి, పద్మమ్మ, యాదమ్మ, వనిత ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top