రైల్వే కనెక్టివిటీ మరింత పెరగాలి

TEJA NEWS

రైల్వే కనెక్టివిటీ మరింత పెరగాలి

** తిరుపతి – షిరిడీ రైలు ప్రారంభంలో మంత్రి బీసీ జనార్ధన్

తిరుపతి: నవ్యాంధ్రలోని రాజధాని నగరం అమరావతి నుంచీ, తిరుపతి నుంచీ దేశవ్యాప్త అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఏపీ ఆర్అండ్.బీ శాఖల మంత్రి బీసీ జనార్ధన్ అభిప్రాయపడ్డారు. తిరుపతి – సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దిల్లీ నుంచి వర్చువల్ గా ఉదయం ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో తిరుపతి స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, తిరుపతి జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులుతో కలసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి – సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ వారంలో ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉండగా ఇక నుంచి వారంలో రెండు రోజులు భక్తులకు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సాయిబాబా భక్తులు తిరుగు ప్రయాణంకు అనుగుణంగా సమయం మార్చినట్లు ఆయన చెప్పారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తిరుపతి నుంచి నేరుగా రైలు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, గుంతకల్లు డిఆర్ఎం, స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ (ఎస్ఎంఆర్) రెడ్డెప్ప, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, డాలర్స్ దివాకర్ రెడ్డి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణా, రైల్వే సీనియర్ టీసీలు అమర్ నాధ్, వేణుమాధవ, సుధాకర్, దసరథ, టీవీ రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top