కవిత గారు మీరు చెల్లని రూపాయి…..మీరా అత్యధిక మెజారిటీతో గెలిచిన మా ఎమ్మెల్యే

TEJA NEWS

కవిత మీరు చెల్లని రూపాయి…..మీరా అత్యధిక మెజారిటీతో గెలిచిన మా ఎమ్మెల్యే ని అనేది : బిఆర్ఎస్ నాయకులు….

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ లో పర్యటించిన కల్వకుంట్ల కవిత కుత్బుల్లాపూర్ పై కనీస అవగాహన లేకుండా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పత్రికా ప్రకటన ద్వారా కల్వకుంట్ల కవిత పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

బిఆర్ఎస్ పార్టీకి నీవు శని లాగా దాపురించావు. 2014 లో ఎంపీ గా గెలిచిన నీవు, 2019 లో నిజామాబాద్ లో ఓడిపోయి చెల్లని రూపాయిగా మిగిలిపోయావు. అయినా పెద్దలు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయినా మేము తెలంగాణ జాతిపిత గారైన కేసీఆర్ బిడ్డగా మిమ్మల్ని గౌరవించాం.

గత 10 సంవత్సరాలుగా కెసిఆర్ దేశానికి ఆదర్శంగా తెలంగాణ తీర్చిదిద్దిన విషయం గుర్తుకు లేదా…?

జనం బాటలో జనం లేక విలవిలలాడుతూ మతిభ్రమించి తిరుగుతున్నావు.

పెరికచెరువుపై నీవు చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం.

ఒక జిల్లా మంత్రి లాగా తిరుగుతున్న నీవు ఎవరి పక్షాన పని చేస్తున్నావనేది ప్రజలకు అర్థమవుతూనే ఉంది..?

రేవంత్ రెడ్డి బంధువు బి.ఎన్.రెడ్డి తో నీ భర్త అనిల్ 2500 కోట్ల స్కామ్ చేసింది గుర్తుకు వస్తలేదా…?

లిక్కర్ స్కామ్ లో దొరికి తెలంగాణ మహిళలను కూడా అవమాన పరిచావు..?

క్యూ న్యూస్ ఆఫీసు పై దాడులు చేస్తే ఇప్పటి వరకు నీపై చర్యలు లేవు.

రాజీనామా చేసి నాలుగు నెలలైనా మీ ఎమ్మెల్సీ పదవిని ఎందుకు ఆమోదించలేదు.

ఇంకోసారి ఇలాగే మాట్లాడితే కెసిఆర్ కూతురు అని కూడా చూడండి.

సీఎం రేవంత్ రెడ్డినా…? కవితనా…? ఆయన మాట్లాడిందే, ఈమె మాట్లాడుతుంది…,

గతంలో కుత్బుల్లాపూర్ పర్యటనకు వచ్చిన నీవు కేంద్రంతో కొట్లాడయినా జగద్గిరిగుట్టలో బస్సు డిపో కట్టిస్తా అన్నావ్…? ఏమైంది నీ మాట…?

అడికోర్ పెట్టుబడులపై మాట్లాడండి. రేవంత్ రెడ్డి, మీరు డైరెక్టర్లుగా ఉన్న ఈ కంపెనీలో పెట్టుబడులపై ముందు మాట్లాడండి.

రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో 300 డివిజన్లలో పోటీ చేసి 200కు పైగా మళ్లీ గ్రేటర్ ఇలాకాలో జెండా ఎగరవేస్తాం. కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తాం.

ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, నాయకులు కస్తూరి బాల్ రాజ్, తెలంగాణ సాయి, ఇస్మాయిల్, శివా నాయక్, మహిళా నాయకురాలు అర్పితా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top