తెలంగాణ దీక్ష విజయ్ దివాస్
కెసిఆర్ ఆమరణ దీక్షతో ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కూకట్పల్లి నియోజకవర్గ ఎస్ స్సి విభాగ అధ్యక్షులు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో కూకట్ పల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వై జంక్షన్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కెసిఆర్ చిత్రపటానికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కురుమయ్య నవీన్ రావు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి నియోజకవర్గం దళిత నాయకులు మరియు వివిధ డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది
