శీతల తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానోతు కృష్ణ ఏకగ్రీవం

TEJA NEWS

శీతల తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బానోతు కృష్ణ ఏకగ్రీవం

శీతల తండా గ్రామాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని చరిత్ర తిరగరాసిన గ్రామ ప్రజలు

చిలుకూరుమండల పరిధిలోని శీతల తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోతు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామములో మంచి వ్యక్తి కావడంతో పండుగ వాతావరణం నెలకొని ఉంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీతల తండా గ్రామపంచాయతీ సర్పంచిగా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపాడు గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా నాయకులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే గ్రామములో నెలకొని ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ప్రజలను కలుపుకొని భాగస్వామ్యం చేస్తూ కృషి చేస్తానని తెలిపారు.

గ్రామములు గతంలో అనేక సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో గ్రామస్తులకు కల్పిస్తూ నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశానని గుర్తు చేశాడు. విద్యార్థులకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీచేశానని దీనితోపాటు నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశానని తెలిపారు తెలిపారు గ్రామంలో ఉన్న సమస్యలు అభివృద్ధికి మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈ మాజీ సర్పంచి తేజవతి దూదియా, ఇస్లావత్ భాష ఇస్లావత్తు సక్రు మల్సూర్, లచ్చిరాం అర్జున్ నాయక్ శ్రీనివాస్ నాగేశ్వరరావు అనిల్ నాయక్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top