TEJA NEWS

ప్రజల మధ్ధ్యే ఉంటా.. గ్రామానికి సేవ చేస్తా: మహాలింగాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి

శంకర్‌పల్లి: ప్రజల మధ్య ఉంటా గ్రామానికి సేవ చేస్తా అని మహా లింగపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మాచన్నగారి రాఘవేందర్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహిళలు, నాయకులు, యువకులతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గత ఏడు సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధితోపాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని గుర్తు చేశారు. సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ మెడికల్ క్యాంపులు, పిల్లలకు, గర్భిణి మహిళలు, వృద్ధులకు ప్రత్యేక ఆరోగ్య సేవలు పోషకాహారం అందజేస్తానన్నారు. కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వ్యవసాయ ఆధునీకరణకు పూర్తి సహకారం, రైతులకు అవసరమైన సమాచారం, సౌకర్యాలు, పంటలు, పశువులకు అవసరమైన సేవల కల్పన, అంగన్వాడీ, బాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామంలో ప్లే గ్రౌండ్ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానన్నారు. గ్రామంలో ముఖ్య ప్రాంతాలు, సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సభలు కచ్చితంగా నిర్వహణ అందరికీ పాల్గొనే అవకాశం కల్పిస్తానన్నారు. స్మశాన వాటిక పూర్తిస్థాయి అభివృద్ధి సరైన మౌలిక వసతుల ఏర్పాటు చేస్తానన్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి బావులు అన్నింటికీ పైకప్పు, ఇనుప జాలీలతో నిర్మిస్తానన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో సమస్యలపై తక్షణమే స్పందిస్తానన్నారు. కొత్త డ్వాక్రా భవన నిర్మాణం చేపడతామన్నారు. జడ్పిహెచ్ఎస్, గ్రామపంచాయతీ కార్యాలయానికి కంప్యూటర్, ప్రింటర్ సదుపాయం కల్పిస్తానన్నారు.

స్కూల్ భవన అప్గ్రేడేషన్, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తానన్నారు. కాలనీ వారిగా అండర్ గ్రౌండ్ సేకరణకు పూర్తి ఏర్పాట్లు చేస్తారన్నారు. పాత 11 కెవి విద్యుత్ స్తంభాల తొలగింపు, మార్పులు చేస్తానన్నారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, సోలార్ స్ట్రీట్ లు లైట్లు ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి కాలనీలో మెరుగైన రోడ్లు, గ్రామ దేవాలయాల పునరుద్ధరణ, ప్రతి కుల సంఘానికి పక్క భవనాలు నిర్మించి తీరుతానన్నారు. కాలనీ పేర్లు నెంబర్లు స్పష్టంగా ఏర్పాటు చేస్తానని, గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడం, గ్రామంలో బస్టాపు నిర్మాణం, ప్రతి గల్లీలో ప్రభుత్వం ద్వారా సిసి రోడ్లు నిర్మిస్తానని గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ అభ్యర్థి మాచన్నగారి రాఘవేందర్ హామీ ఇచ్చారు.