వైబ్రన్స్ 2K26” పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్

TEJA NEWS

వైబ్రన్స్ 2K26” పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్.

విజయవాడ,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని సెక్రటేరియట్ లో కలిసి రాష్ట్రవ్యాప్త ఇంటర్-కాలేజియేట్ కల్చరల్ & టెక్నికల్ మహోత్సవం “వైబ్రన్స్ 2K26” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయమని విజయవాడ లో ని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జున రావు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిబ్బంది ఆహ్వానించినట్లు ప్రకటనలో తెలిపారు.

 ఈ సందర్భంగా “వైబ్రన్స్ 2K26” అధికారిక పోస్టర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.

కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ చలవాది మల్లికార్జున రావు, వైస్ ప్రెసిడెంట్ పొట్టి సురేంద్ర కుమార్, సెక్రటరీ & కరస్పాండెంట్ సి.ఎ డా. చిట్టా అమర్ సుదీర్, జాయింట్ సెక్రటరీ గ్రంధి పవన్ కుమార్, కళాశాల ట్రెజరర్ కాజా రాఘవయ్య, ప్రిన్సిపాల్ డా. యస్. శరవణ కుమార్, ఫెస్ట్ కో-ఆర్డినేటర్లు డా. అక్బర్, శ్రీమతి నవ్యశ్రీ, మరియు యం. విక్టర్ జాన్సన్ తదితరులు మంత్రిని ఆహ్వానించిన వారిలో ఉన్నారు..

You cannot copy content of this page

Scroll to Top