భారతీయ జనతా పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ
దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి అధ్యక్షతన
GHMC లో విలీనం అనంతరం కంజర్వేషన్, ఇతర జోన్ ల మార్పిడి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు గురిచేసే విధానం పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ , చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , మాజీ భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొని రైతు సమస్యలు వివరించడం జరిగింది
నాయకులు మాట్లాడుతూ ప్రజలకోసం ఎన్నుకోబడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమస్యలు లేకుండా చేయాల్సింది పోయి ప్రజలను పీడించే విదంగా తయారై భూములు అమ్ముడు జోన్ల మార్పిడి కోసం కమిషన్ కోసమే పనిచేస్తున్నట్టుందన్నారు పంచాయతీ నుండి మున్సిపల్ మున్సిపాలిటీ నుండి GHMC మార్చడం ఎంత సులువు చేశారో జోన్ల మార్పిడి చేసి కంజర్వేషన్ జోన్లు కూడా వెంట్ల ఎత్తివేయాలని మీడియా ముకంగా కోరడం జరిగింది. లేని యెడల అన్ని పార్టీలను కలుపుకొని జేఏసీ గా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు
మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బౌరంపేట్ ఓఆర్ఆర్ పక్కనే SDZ లో ఉన్నా కూడా రింగ్ రోడ్డు లో భూమి కోల్పోయిన కానీ డైరెక్ట్ రోడ్డు ఎక్కడానికి లేదన్నారు కంజర్వేషన్ జోన్ ఉండడం వలన ఇద్దరు కొడుకులున్న కుటుంబం ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు వెంటనే జోన్ మార్పిడికి బీజేపీ నాయకులను పెద్దలను చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమం లో రైతులు,బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి,నల్ల రామచంద్ర రెడ్డి బౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ రైతులు దర్శన్ రెడ్డి ,బీ శంకర్ రెడ్డి , పి కరుణాకర్ రెడ్డి ,ఆర్ కృష్ణ ముదిరాజ్ , డి కృష్ణారెడ్డిగారు,డి సత్యనారాయణ గారు, డి అంజిరెడ్డి , పి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
