3,00,000ల ఎల్వోసీ పత్రాన్ని అందజేసిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎస్ ఆర్ నాయక్ నగర్ కాలనీ వాసులు కె రమణమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 3,00,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ 3,00,000/- ( మూడు లక్షల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి కుటుంబ సబ్యులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైసి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, అచ్చమ్మా, విజయ్ మరియు తదితరులు పాల్గొన్నారు
