అజీజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహం వద్ద నిరసన
శంకర్పల్లి: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించినందుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల అజీజ్ నగర్ లో ఆదివారం ఉదయం గాంధీజీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీమ్ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రెటరీ వంశీ చంద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పిటిసిలు, నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని భీమ్ భరత్ కోరారు.
