ప్రపంచ ధ్యాన దినోత్సవ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఎమ్మార్వో దృవకుమార్.

TEJA NEWS

ప్రపంచ ధ్యాన దినోత్సవ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఎమ్మార్వో దృవకుమార్. నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవంను జయప్రదం చేయండి.

           చిలుకూరు :శాంతి, కరుణ మరియు ఐక్యత కోసం డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు జరిగే హార్ట్ ఫుల్ నెస్ ధ్యానోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చిలుకూరు ఎమ్మార్వో ధ్రువ కుమార్ పిలుపునిచ్చారు.  కార్యాలయంలో ప్రపంచ దినోత్సవం పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, జడ్పీ హైస్కూల్, గ్రామపంచాయతీ, పశువైద్యశాల కార్యాలయాల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించడం, పోస్టర్లను కరపత్రాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఆయా కార్యాలయాల సిబ్బంది, జోనల్ కోఆర్డినేటర్ వరప్రసాద్, సిసి శివరాం ప్రసాద్, ప్రశిక్షకులు కే ఎల్ ఎన్ ఆచార్యులు, అభ్యసిలు కస్తూరి రాములు, పుట్టపాక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top