తిరుమలకుంట పంచాయతీలో ఘనంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు అత్యంత వైభవంగా, జనసందోహం మధ్య ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
అధికారికంగా బాధ్యతల స్వీకారం:
నిర్ణయించిన శుభముహూర్తానికి ఉదయం 10:09 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ) కటకాల కార్తీక్ నూతన పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్‌గా కోర్స రాజేష్, ఉపసర్పంచ్‌గా పానుగంటి నాగసత్య శ్రీనివాసరావు మరియు వార్డు సభ్యులు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గ సభ్యులు:
- సర్పంచ్: కొర్స రాజేష్
- ఉపసర్పంచ్: పానుగంటి నాగసత్య శ్రీనివాసరావు
- వార్డు సభ్యులు:
- పొట్టా నాగేంద్ర (1వ వార్డు)
- మచ్చ జగదాంబ (2వ వార్డు)
- పూనెం రమణ (3వ వార్డు)
- పానుగంటి వేణుబాబు (5వవార్డు)
- చిప్పల రమణ (6వ వార్డు)
- కుర్సం వెంకటేష్ (7వ వార్డు)
- మడకం ఈశ్వరమ్మ (8వ వార్డు)
- పొట్టా రామకృష్ణ (9వ వార్డు)
- డబా ముత్యాలు (10వ వార్డు)
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా కాల్చి, “జై కాంగ్రెస్” నినాదాలతో హోరెత్తించారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పాలన అందిస్తామని ఈ సందర్భంగా నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు సభ్యులు పేర్కొన్నారు.
