రాష్ట్రస్థాయి హాకీ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే
వనపర్తి :
ఈనెల 20, 21 తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని సరూర్ న గర్ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ – 19 హాకీ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్నగర్ హాకీ జట్టు మొదటి స్థానం సాధించింది
ఈ క్రమంలో సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తన నివాసంలో క్రీడాకారులకు (బాలికల విభాగం) శాలువాలతో సన్మానించి అభినందించారు
జాతీయస్థాయిలోను సత్తా చాటాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు
ఈ సందర్భంగా జాతీయస్థాయికి ఎంపికైన సుమధుర యామిని శ్రీజ భూమికలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు
కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కుమార్, మన్యం యాదవ్, అనిల్ కుమార్, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ పాల్గొన్నారు
