పెదనందిపాడు మండలం రాజుపాలెం

TEJA NEWS

పెదనందిపాడు మండలం రాజుపాలెంలో చిలకలూరిపేటకు చెందిన జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గార్డ్స్) ఆధ్వర్యంలో బుదవారం సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగింది. తొలుత ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు.. ఇందులో భాగంగా వృద్ధ వితంతు మహిళలు 40 మందికి చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా ప్రముఖ న్యాయవాది, మాజీ ఏజిపి దాసరి చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గార్డ్స్ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గార్డ్స్ అధ్యక్ష కార్యదర్శులు దాసరి ధనలక్ష్మీ, పొనుగుబాటి బుల్లి బాబు తో పాటు సభ్యులు షేక్ బాజీ, వడ్లన చంద్రం తదితరులున్నారు.

You cannot copy content of this page

Scroll to Top