రైతులుగా మారిన విద్యార్థులు..
కోదాడ : కోదాడ పట్టణ పరిధిలోని రామ్మూర్తి నగర్, శ్రీమన్నారాయణ కాలనీల్లో గల స్మార్ట్ పాఠశాలల్లో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు రైతుల వేషధారణతో అలరించారు. విద్యార్థులకు రైతుల సమస్యలను ఉపాధ్యాయులు వివరించారు. పంట సాగు ఏ విధంగా చేయాలనే అంశాలపై ప్రధానోపాధ్యాయుడు ప్రసన్నకుమార్ విద్యార్థులకు వివరించాడు. దేశాన్ని, రైతులను గౌరవించాలని సూచించారు మస్రా, సైనా, శిరీష, లహరి తదితరులు పాల్గొన్నారు.
