సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే నిలుస్తుంది : ఎమ్మెల్యే జారే

TEJA NEWS

సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే నిలుస్తుంది : ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సీతారామ ప్రాజెక్టు కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని త్వరలో సాగునీటి సమస్య ఉండదన్నారు. సమృద్ధిగా నీరు అందించి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అనంతరం బెండాలపాడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చండ్రుగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ తరపున నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top