కె.యం. ప్రతాప్ ఆధ్వర్యంలో,అల్ మెలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వరుసగా ఐదవ వేతన ఒప్పందం.

TEJA NEWS

కె.యం. ప్రతాప్ గారి ఆధ్వర్యంలో,
అల్ మెలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వరుసగా ఐదవ వేతన ఒప్పందం.

అల్ మెలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రంగారెడ్డి నగర్,
ఐ.డి.ఏ కూకట్ పల్లి, యాజమాన్యంతో ఐదవ (5 th )నూతన వేతన ఒప్పందం
మూడు సంవత్సరాల కాలవ్యవధిగల వేతన ఒప్పందంలో ప్రతి కార్మికునికి, ప్రతినెల రూపాయలు 12,000 పెరిగే విధంగా కృషిచేసిన రంగారెడ్డి జిల్లా మాజి డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, కంపెనీ కార్మిక యూనియన్ అధ్యక్షులు, పెద్దలు,
శ్రీ కె.యం. ప్రతాప్ .
ఈ యొక్క నూతన వేతన ఒప్పందం
టి.అంజయ్య కార్మిక భవన్లో, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్
జే. శ్యాంసుందర్ సమక్షంలో, అల్ మైలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్
కె.వీర్రాజు, ప్రొడక్షన్ మేనేజర్ బి.హెచ్.వి. ఎస్.మూర్తి గార్ల తో కలిసి నూతన వేతన ఒప్పందాన్ని కార్మిక యూనియన్ అధ్యక్షులు శ్రీ కె.యం.ప్రతాప్ గారు చేశారు.

నూతన వేతన ఒప్పందంలోని ముఖ్యంశాలు :

1.నూతన వేతన ఒప్పందం
01-01-2025 నుండి 31-12-2027 వరకు జరిగింది.
పై అంశంతో కూడిన నూతన వేతన ఒప్పందం వలన సీనియర్ కార్మికులకు గతంలో 41,275 జీతం నుండి 53,275 కు పెరిగింది.
జూనియర్ కార్మికులకు పాత జీతం 34,518 రూపాయల నుండి 46,518 రూపాయలకు పెరిగింది.

  1. రిటైర్మెంట్ గిఫ్ట్ 1,00,000 రూపాయల నుండి 1,50,000 లకు పెంచడం జరిగింది.
  2. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరానికి పూర్తి కుటుంబానికి రూపాయలు 2,00000 లకు పెంచడం జరిగింది.
  3. ఇన్సూరెన్స్ పాలసీ గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ (జిపిఏ) ను 5 లక్షల నుండి 10 లక్షల కు పెంచడం జరిగింది.
  4. టూర్ అలవెన్స్ (ఎల్ టి ఏ) ప్రతి సంవత్సరం రూపాయలు 8,000 నుండి 10,000 లకు పెంచడం జరిగింది.
  5. విద్యార్థులకు చేయూత:
    1.కంపెనీలోని కార్మికుల పిల్లలు పదవ తరగతిలో 85% ఉత్తీర్ణతను సాధిస్తే, వారికి 7,500 రూపాయల క్యాష్ గిఫ్ట్ను మేనేజ్మెంట్ ఇచ్చేలా ఒప్పందం జరిగింది.
  6. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 85% ఉత్తీర్ణతను సాధిస్తే,వారికి 10,000 రూపాయల క్యాష్ గిఫ్ట్ ను మేనేజ్మెంట్ వారు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
  7. డిగ్రీ/ బీటెక్ లో 85% ఉత్తీర్ణతను సాధించిన వారికి 12,000 రూపాయల క్యాష్ గిఫ్ట్ ను మేనేజ్మెంట్ వారు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
    ఈ నూతన ఒప్పందం జరుగుటకు కృషి చేసిన కార్మిక సంక్షేమ ప్రదాత శ్రీ కె.యం.ప్రతాప్ గారికి కృతజ్ఞతలను తెలియజేశారు యూనియన్ నాయకులు, కార్మికులు.
    ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు :
    యం. శ్రీనివాసరెడ్డి,
    ఎస్.రామచందర్, ప్రధాన కార్యదర్శి :
    యం.శాంతారావ్, సంయుక్త కార్యదర్శి :
    కె.మల్లికార్జున, ఆర్గనైజింగ్ సెక్రెటరీ : యం.సురేష్,
    కోశాధికారి జయన్న, కమిటీ సభ్యులు :
    డిఎస్. కృష్ణ, ఎస్ రాజు, పి.కుమార్,
    జి.చిన్నపరెడ్డి,
    ఎం. యాదగిరి గౌడ్,
    వి ఆర్ సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    విద్యుత్ బకాయి సమస్యపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారిని కలిసిన జగద్గిరిగుట్ట రాజీ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ వారు. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప లో నీటి సరఫరాకు వాడుతున్న మోటార్ల బిల్లు బకాయి ఉన్నందున విద్యుత్ అధికారులు మోటర్ కనెక్షన్ కట్ చేస్తామని కాలనీ వాసులకి చెప్పడం జరిగింది. ఈ విషయం కాలనీవాసులు అందరూ కలిసి ఈరోజు షాపూర్ నగర్ లోని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారికి తెలపడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ ప్రతి ఇంటి నుండి వసూలు చేసిన పైసలు విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి కట్టలేదని అందుచేత కరెంట్ బిల్లు బకాయి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ దీనిపై విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప అధ్యక్షుడు అంజయ్య, ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గౌడ్, వంగ పరశురాములు, వైకుంఠం, సంధ్య, మాధవి రెడ్డి, ఎండి రంజాన్, అనూష, అనిత, మమత, జిలాని, ఇస్మాయిల్, జహీర్, రాజేశం మరియు కమిటీ వారు, కాలనీవాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top