విద్యుత్ బకాయి సమస్యపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్

TEJA NEWS

విద్యుత్ బకాయి సమస్యపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన జగద్గిరిగుట్ట రాజీ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ వారు.

జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప లో నీటి సరఫరాకు వాడుతున్న మోటార్ల బిల్లు బకాయి ఉన్నందున విద్యుత్ అధికారులు మోటర్ కనెక్షన్ కట్ చేస్తామని కాలనీ వాసులకి చెప్పడం జరిగింది. ఈ విషయం కాలనీవాసులు సాక్షిత :అందరూ కలిసి షాపూర్ నగర్ లోని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి తెలపడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ ప్రతి ఇంటి నుండి వసూలు చేసిన పైసలు విద్యుత్ డిపార్ట్మెంట్ వారికి కట్టలేదని అందుచేత కరెంట్ బిల్లు బకాయి ఉందని తెలిపారు.

  ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ దీనిపై విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

  ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప అధ్యక్షుడు అంజయ్య, ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గౌడ్, వంగ పరశురాములు, వైకుంఠం, సంధ్య, మాధవి రెడ్డి, ఎండి రంజాన్, అనూష, అనిత, మమత, జిలాని, ఇస్మాయిల్, జహీర్, రాజేశం మరియు కమిటీ వారు, కాలనీవాసులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top