నూతన సంవత్సరం సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి మరియు కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మరియు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరియు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళా నాయకులు, మరియు కార్మిక సోదరులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం, వివిధ కాలనీలా వెల్ఫేర్ అసోసియేషన్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
