సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు….
రామయంపేట పట్టణంలో
కాంగ్రెస్ నాయకుడు గజవాడ నాగరాజు నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో నవ కుండాత్మక సుదర్శన నరసింహ హోమంలో
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావుకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో నాగరాజు ఈ కార్యక్రమంలోని చేపట్టడం ఎంతో సంతోషించేదగ్గ విషయం అన్నారు. నరసింహస్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామయంపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
