స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ మరియు శ్రీ ఆదిలీల ఫౌండేషన్, న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు.
శ్రీ స్వామి వివేకానంద స్పూర్తి పురస్కారాల వేడుక తేదీ జనవరి,12,2026. వేదిక: చిక్కడపల్లి త్యాగరాజ గాన సభ, హైదరాబాదు.
శ్రీ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన వేడుకలలో సామాజిక,ఆధ్యాత్మిక, వైద్య, ఇతర రంగాల్లో మీరు చేసిన విశేషమైన కృషికి గుర్తింపుగా అందిస్తున్న శ్రీ స్వామి వివేకానంద స్పూర్తి పురస్కారం.
ఈ అవార్డును ప్రముఖ రచయిత్రి, రేఖీ థెరపీ గ్రాండ్ మాస్టర్, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజికవేత్త శ్రీమతి లక్ష్మీ కమలాకర్ గారు శ్రీ స్వామి వివేకానంద స్ఫూర్తి పురస్కారం -2026 అవార్డు ప్రదానోత్సవం చేశారు.
ఇదే అవార్డును శ్రీ సముద్రాల కిరణ్, ప్రముఖ జర్నలిస్టు, సీఈఓ ఇంటర్ కాంటినెంటల్ రోడ్ సేఫ్టీ ప్రోబ్ కాన్ఫెడరేషన్ వరించడం జరిగింది.
ఈ అవార్డును అందుకున్న మరో ప్రముఖ వ్యక్తి డాక్టర్ నత్త యోబు సీఈవో రాందేవ్రావు ఆసుపత్రి, కూకట్పల్లి.
డాక్టర్ యోబు మాట్లాడుతూ ఈ అవార్డు తీసుకోవటం ద్వారా తనపై బాధ్యత మరింత పెరిగిందని శ్రీ స్వామి వివేకానందుని ఆదర్శంగా సమాజానికి మరింత సేవ చేయాలని స్వామి వివేకానంద స్పూర్తిగా తీసుకుని తద్వారా సమాజంలో అన్ని వర్గాలవారికి ఈ అవార్డును రాందేవ్రావు ఆసుపత్రి డాక్టర్లు మరియు స్టాఫ్ కి అంకితమిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సముద్రాల వేణుగోపాలచారి , వకులాభరణం కృష్ణమోహన్ , డాక్టర్ ఎస్. ఆదినారాయణ , కేశీరాజు రాం ప్రసాద్ , నర్సిరెడ్డి , బడే సాహెబ్ , అనేక మంది ప్రముఖుల మధ్యలో ఈ అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది
