క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలం, క్రమశిక్షణ, సహనం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయి.

TEJA NEWS

క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలం, క్రమశిక్షణ, సహనం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయి.

క్రీడారంగ బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకు సాగుతోంది..

గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి సీఎం కప్ క్రీడా పోటీలు దోహదపడుతున్నాయి.

విద్యార్థులు, యువత మత్తును వదిలి మైదానాల వైపు రావాలని ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు…

సీఎం రేవంత్ రెడ్డి గారు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ క్రీడారంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు…

తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…

సీఎం కప్–2026 పోటీలను అందరూ విజయవంతం చేయాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు గారు పిలుపునిచ్చారు…

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా, మండల, డివిజన్, గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న రెండవ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్–2026 కార్యక్రమంలో భాగంగా పర్వతగిరి మండల కేంద్రంలో టార్చ్ ర్యాలీగా నిర్వహించిన క్రీడా జ్యోతి ర్యాలీని గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ గారు, ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు, యువత, క్రీడాకారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

తొలుత చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు…

అనంతరం పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వాయనాడ్ ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ:- ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ కప్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయని అన్నారు.
క్రీడా జ్యోతి ర్యాలీ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా, యువతలో ఆరోగ్య అవగాహన, క్రీడలపై ఆసక్తి, ఐక్యతా భావాన్ని పెంపొందించే ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. నేటి యువత మొబైల్ ఫోన్లు, మత్తు పదార్థాల వైపు ఆకర్షితమవుతున్న ఈ తరుణంలో క్రీడలు వారిని సరైన దారిలో నడిపించే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు.
క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక బలాన్ని, క్రమశిక్షణను, సహనం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని ఎమ్మెల్యే వివరించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువత పోటీ తత్వాన్ని ఆరోగ్యకరంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకుంటారని అన్నారు. విజయం సాధించినప్పుడు ఆనందాన్ని, ఓటమిని ఎదుర్కొన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే తత్వాన్ని క్రీడలు నేర్పుతాయని తెలిపారు…

క్రీడారంగ బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో విద్యార్థుల అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చూపించి ఆయా గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
నేటి సమాజంలోని విద్యార్థులు, యువత మత్తును వదిలి మైదానాలకు రావాలని, సీఎం రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించి క్రీడారంగ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని, ఇటీవలే హైదరాబాద్ కు క్రీడాకారుడు మెస్సిని తీసుకొని వచ్చారని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.

ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి యువ క్రీడాకారులు ముందుకు వచ్చి చీఫ్ మినిస్టర్ కప్ పోటీల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించినప్పుడే యువతకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారుల కోసం మౌలిక వసతులు, క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని తెలిపారు..

తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాగరాజు గారు పేర్కొన్నారు. చీఫ్ మినిస్టర్ కప్ వంటి కార్యక్రమాలు భవిష్యత్‌లో రాష్ట్రానికి గొప్ప క్రీడాకారులను అందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, క్రీడలను ఒక కెరీర్‌గా చూసే దృక్పథాన్ని పెంచుకోవాలని సూచించారు.
క్రీడల ద్వారా యువత ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుంటారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతను, క్రీడాకారులను ఆయన అభినందిస్తూ, భవిష్యత్‌లో మరింత పట్టుదలతో సాధన చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చీఫ్ మినిస్టర్ కప్–2026 పోటీలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని ఎమ్మెల్యే నాగరాజు గారు అన్నారు…

You cannot copy content of this page

Scroll to Top