రూ.1ఒక కోటి 91 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయం

TEJA NEWS

రూ.1ఒక కోటి 91 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ B బ్లాక్, మాదాపూర్ విలేజ్, కావూరి హిల్స్ కాలనీల లో రూ.1ఒక కోటి 91 లక్షల 50 వేల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు గౌరవ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారు మరియు జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో ఈ రోజు శ్రీరామ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ B బ్లాక్, మాదాపూర్ విలేజ్, కావూరి హిల్స్ కాలనీలలో రూ. 1ఒక కోటి 91 లక్షల 50 వేల రూపాయల తో UGD నిర్మాణము పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు,అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి గాని ,కార్పొరేటర్ గార్ల దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

శ్రీరామ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ A బ్లాక్, ప్రేమ్ నగర్ B బ్లాక్, మాదాపూర్ విలేజ్, కావూరి హిల్స్ కాలనీలలో గల ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, నిత్యం పొంగుతుండటం వలన కాలనీ వాసులు ,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు UGD పైప్ లైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని, అదేవిధంగా
ప్రతి కాలనీ లో స్వచ్ఛమైన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం ద్వారా కాలనీ వాసులకు ప్రజలకు, స్వచైమన మంచి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని PAC చైర్మన్ గాంధీ గారు అన్నారు.

మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, UGD పైప్ లైన్ వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది , నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగా సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి
ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వివరాలు

1.శ్రీరామ్ నగర్ A బ్లాక్ కాలనీ లో రూ.42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే (UGD) భూగర్భ డ్రైనేజి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది

2.ప్రేమ్ నగర్ A బ్లాక్ కాలనీ లో రూ.42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే (UGD) భూగర్భ డ్రైనేజి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది

3.ప్రేమ్ నగర్ B బ్లాక్ కాలనీ లో రూ.37.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే (UGD) భూగర్భ డ్రైనేజి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది

4.కావూరి హిల్స్ కాలనీ లో రూ.35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే (UGD) భూగర్భ డ్రైనేజి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది

5.మాదాపూర్ విలేజ్ లో రూ.35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే (UGD) భూగర్భ డ్రైనేజి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది

పైన పేర్కొన్న UGD నిర్మాణము పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ ఆర్ కృష్ణ, డీజిఎం శరత్ రెడ్డి, మేనేజర్ సందీప్,నాయకులు, కార్యకర్తలు, మహిళలు,కాలనీ వాసులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top