“అభివృద్ధి అంటే మాటలు కాదు… ప్రజల జీవితాల్లో కనిపించే మార్పే నిజమైన అభివృద్ధి”….
చేవెళ్ల నియోజకవర్గం:- చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల మరియు శంకర్ పల్లి మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి “దామోదర రాజనరసింహ” , తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి” , చేవెళ్ల ఎంపీ “కొండా విశ్వేశ్వర్ రెడ్డి” , స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” మరియు తాండూర్ ఎమ్మెల్యే “బుయ్యని మనోహర్ రెడ్డి” …* మొయినాబాద్ మునిసిపాలిటీ అజీజ్ నగర్ సమీపంలో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద 15 కోట్ల మునిసిపాలిటీ నిధుల శంకుస్థాపన చేశారు. మొయినాబాద్ పట్టణంలో చందానగర్ నుండి కవేలిగూడ (మం. షాబాద్) వరకు 30 కోట్ల నిధులతో రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. చేవెళ్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల 17.5 కోట్ల నిధులతో నూతన ఆసుపత్రి భవనముకు శంకుస్థాపన చేసి, ఆసుపత్రిలో తిరిగి సందర్శించారు. శంకర్ పల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసి, మున్సిపాలిటీకి సంబంధించిన నూతన జేసీబీని ప్రారంభించారు.
అనంతరం చేవెళ్ల పట్టణంలోని కే.జీ.ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ “నూతన సర్పంచులకు” సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి” , స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” మరియు తాండూర్ ఎమ్మెల్యే “బుయ్యని మనోహర్ రెడ్డి” పాల్గొని, సర్పంచులకు శాలువాలతో సన్మానించారు. మొయినాబాద్ మునిపాలిటీ హిమాయత్ నగర్ చౌరస్తా దగ్గర వివిధ అభివృద్ధి పనులకు 15 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. మొయినాబాద్ మునిసిపాలిటీ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ ఘనవ్యర్థాల నిర్వాహణ ప్లాంట్ మరియు ఆస్పిరేషన్ టాయిలెట్స్ మరియు వసతి గదులు (అకామిడేషన్ రూమ్స్) 2.42 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
