యువకులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి………

TEJA NEWS

యువకులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి………
డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య

వనపర్తి

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వి.రజని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఇండోర్ స్టేడియం, వివేకానంద విగ్రహం మరియు గోపాల్ పేట్ హనుమాన్ వీధిలోని యువకులకు మాదకద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని నమ్మిన మహానీయుడు స్వామి వివేకానంద గారి ఆశయాలను స్మరిస్తూ,
యువత తమ శక్తి, జ్ఞానం, క్రమశిక్షణతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మరియు
నైతిక విలువలు, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగుతూ
బలమైన భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి అని కోరారు.
అన్ని రంగాల్లో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. మరియు యువతకు ఆటల పోటీల వల్ల శారీరకంగా మానసికంగా ఉత్సాహం తోపాటు ఐక్యమత్యాన్ని పెంచుతాయని తెలియజేశారు . కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ ఏం రఘు ఇతరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top