విశాల తెలంగాణ దినపత్రిక” నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ”
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా
“విశాల తెలంగాణ దినపత్రిక ” – 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.
బాచుపల్లి లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సామాన్యుల గొంతుకగా నిలుస్తూ, నిర్భయంగా వార్తలను వెలుగులోకి తీసుకొస్తున్న విశాల తెలంగాణ దినపత్రిక పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ విశేష ఆదరణ పొందుతున్న ఈ దినపత్రిక, ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా తన సేవలను మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విశాల తెలంగాణ దినపత్రిక యాజమాన్యానికి, పత్రిక మిత్రులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
