తొగర్రాయి అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు….*
కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా అక్షరాభ్యాసం జరిగింది సకలవిద్యా స్వరూపిణి, పరాశక్తి జ్ఞానప్రదాయిని, శ్రీ సరస్వతీ దేవి
చదువుకునే పిల్లలకు, నిత్య జ్ఞాన సముపార్జన చేసే వారికి వసంత పంచమి చాలా ప్రత్యేకమైన శుక్రవారం మరింత ప్రత్యకతను తీసుకువచ్చాయి. ఈ రోజు చదవుల తల్లి సరస్వతి దేవిని పూజించడం వలన విద్యలో విద్యార్థులు, జ్ఞానంలో జ్ఞానాభిలాషులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఙ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా వసంతపంచమి రోజున విద్యార్థులు సరస్వతి దేవిని పూజించాలి. పిల్లలకు విద్యా పరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. జ్ఞానాభివృద్ధి సులభం అవుతుంది. జీవితంలో విజయం సాధ్యమవుతుంది.
సరస్వతి దేవత జ్ఞానం, కళ, సంగీతం, విద్య , విజ్ఞానానికి అదిష్ఠాన దేవత. ఆమె పుట్టిన రోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకతంగా పూజలు చేస్తారు. అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని.
విద్యార్థులకు మంచిగా చదివేందుకు ప్రేరణ ఇవ్వడానికి సరస్వతి దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు, శక్తిని పొందుతారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రమీల అంగన్వాడి టీచర్ సునీత, ఆయా కె.బొందమ్మ, ఆశ కార్యకర్త ఆర్. సైదమ్మ, గర్భిణీ స్త్రీలు ,బాలింతలు వారి పిల్లలు పాల్గొనిఈకార్యక్రమాన్నివిజయవంతం చేశారు.
